మెకానికల్ ఏనుగును కానుకగా అందించిన త్రిష

ఆమె రెండు ప్రసిద్ధ ఆలయాలకు అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన, జీవసమానమైన మెకానికల్ ఏనుగును దానం చేశారు.;

By :  K R K
Update: 2025-06-29 09:47 GMT

దక్షిణాది అందాల హీరోయిన్ .. త్రిష కృష్ణన్.. జంతు సంక్షేమ కార్యకర్తగా తనకున్న గుర్తింపుతో పాటు, తమిళనాడు ఆలయ సంస్కృతికి అద్భుతమైన, ఆలోచనాత్మకమైన కానుకను అందించారు. ఆమె రెండు ప్రసిద్ధ ఆలయాలకు అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన, జీవసమానమైన మెకానికల్ ఏనుగును దానం చేశారు. ఇది సంప్రదాయాన్ని, ఆధునికతను అద్భుతంగా మేళవించే చక్కని ఉదాహరణ.

ఈ ఆనిమాట్రానిక్ ఏనుగు, గజ అనే పేరుతో పిలువబడుతుంది. ఇది ఆలయ ఆచారాలు, వేడుకలు, ఉత్సవాలలో పాల్గొనేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ మెకానికల్ ఏనుగు, జీవ ఏనుగులను ఉపయోగించడానికి బదులుగా ఒక దయార్ర్దమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. తమిళనాడులోని శ్రీ అష్టభుజ అతిశేష వారాహి అమ్మన్ ఆలయం, శ్రీ అష్టలింగ అతిశేష సెల్వ వినాయక ఆలయాలలో ఈ గజ ఏనుగు ఆచారాలలో భాగమవుతుంది.

త్రిష ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ అద్భుతమైన క్షణంలో భాగం కావడం నాకు ఎంతో థ్రిల్‌గా ఉంది! నిజమైన భక్తి అనేది దయతోనూ, కరుణతోనూ కూడినప్పుడే అసలైన ప్రకాశాన్ని వెదజల్లుతుంది. మన ఆలయ సంప్రదాయాలలో మెకానికల్ ఏనుగును ఆహ్వానించడం అనేది దయ, ఆవిష్కరణ, మన సంస్కృతి యొక్క అద్వితీయ జోడింపు. ఇది నిజంగా ఒక కొత్త ఒరవడిని అందిస్తోంది’’..అని సంతోషంగా తెలిపారు.

Tags:    

Similar News