రజనీకి షారుఖ్ ఖాన్ రిటర్న్ గిఫ్ట్ ?

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో భాగం కావచ్చని. ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు కానీ, షారుఖ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు.;

By :  K R K
Update: 2025-06-20 01:09 GMT

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్క సినిమా అనౌన్స్ చేసినా అభిమానుల్లో హైప్ ఆకాశాన్ని తాకుతుంది. అదీ ఆయన ఆయన క్రేజ్. కానీ, ఆయన తాజా ప్రాజెక్ట్స్‌లో బాలీవుడ్ బాద్‌షా ఆమీర్ ఖాన్, టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగార్జున, స్యాండల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర, మలయాళం టాలెంటెడ్ యాక్టర్ సౌబిన్ షాహిర్, అందాల భామ శృతి హాసన్, అలాగే ‘కట్టప్ప’గా మనసు గెలిచిన సీనియర్ నటుడు సత్యరాజ్ లాంటి భారీ తారాగణం జతకావడంతో కూలీ సినిమా అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయాయి.

యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తుండటంతో ఇది ఒక సినిమా కాదు, ఒక పాన్ ఇండియా సంచలనం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆమీర్ ఖాన్ గురించి టాక్ వినపడుతోంది. ఆయన ఈ సినిమాలో కేవలం 10 నిమిషాల పాటు కనిపించినా, అది కథలో గేమ్ చేంజర్‌లా ఉండబోతోందట. ఆమీర్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు, ఆయన ఇంటెన్సిటీ, డెప్త్ ఆడియెన్స్‌ని కట్టిపడేస్తాయి. ఈ చిన్న రోల్‌తోనే సినిమాకి ఒక సర్‌ప్రైజ్ పంచ్ ఇవ్వబోతున్నారని బజ్.

అయితే.. అసలు బాంబ్ బ్లాస్ట్ లాంటి రూమర్ ఏంటంటే.. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో భాగం కావచ్చని. ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు కానీ, షారుఖ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు. ఒకవేళ ఇది నిజమైతే, ఇది రజనీకాంత్ ‘రావన్’ లో చేసిన కామియోకి షారుఖ్ ఇచ్చే స్టైలిష్ రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చు. షారుఖ్‌కి గెస్ట్ రోల్స్‌తో సీన్ స్టీల్ చేయడం కొత్తేమీ కాదు. ‘లక్ బై ఛాన్స్, బ్రహ్మాస్త్ర, టైగర్ 3’ లాంటి సినిమాల్లో ఆయన చిన్న పాత్రలతోనే అభిమానులను కేకలు పెట్టించాడు. ఒకవేళ కూలీలో రజనీ-షారుఖ్ కాంబో సెట్ అయితే.. అది స్క్రీన్‌పై ఒక మాస్ ఫీస్ట్ అవుతుంది

Tags:    

Similar News