ఆర్య సూపర్ హిట్ స్పోర్ట్ డ్రామాకు సీక్వెల్ !

‘సర్పట్టా పరంపరై 2’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆర్య మరోసారి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే పాత్ర కోసం శరీరాన్ని ద‌ృఢంగా సిద్ధం చేసుకుంటున్న అతడు, ఈసారి అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా ఓ విభిన్నమైన క్రేజీ లుక్‌లో కనిపించ నున్నాడని సమాచారం.;

By :  K R K
Update: 2025-05-15 05:18 GMT

తమిళ స్టార్ ఆర్య ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సర్పట్టా పరంపరై’. ఈ సినిమా 2021 జూన్‌లో రెండవ కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో విడుదలై.. మంచి విజయం సాధించింది. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేరుగా విడుదలై, ఉత్తర చెన్నై బాక్సింగ్ నేపథ్యాన్ని నిజాయితీగా చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. కథనం, నటన, మరియు కఠినమైన క్రీడా జీవన శైలిని అద్భుతంగా ఆవిష్కరించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ మైలు రాయి లాగా నిలిచింది.

ఇప్పుడు అభిమానులకి ఒక శుభవార్త. ‘సర్పట్టా పరంపరై 2’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆర్య మరోసారి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే పాత్ర కోసం శరీరాన్ని ద‌ృఢంగా సిద్ధం చేసుకుంటున్న అతడు, ఈసారి అభిమానులను ఆశ్చర్యపరిచే విధంగా ఓ విభిన్నమైన క్రేజీ లుక్‌లో కనిపించ నున్నాడని సమాచారం. బాక్సర్ పాత్రను మరింత స్టైలిష్ గా చూపించేందుకు అతడు తగినంత శ్రమ చేస్తున్నాడు.

ఈ సీక్వెల్‌లో మరోసారి ఉత్తర చెన్నై నేపథ్యంతో పాటు... మరింత ఉత్కంఠ భరిత కథనం, కొత్త పాత్రలు, మరియు బాక్సింగ్ పోటీలతో ప్రేక్షకులను ఉర్రూత లూగించనుంది. సర్పట్టా అభిమానులు ఇప్పటికే ఈ వార్తతో భలేగా ఖుషీ అవుతున్నారు. మరి ఈ సారి ఆర్య ఇంకెంత పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. 

Tags:    

Similar News