ఆకట్టుకుంటున్న '3 BHK' ట్రైలర్
హీరో సిద్ధార్థ్ ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. పాత్రలో ఒదిగిపోవడానికి తన మేకోవర్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటాడు. లేటెస్ట్ గా ‘3 BHK’ మూవీ కోసం కాలేజ్ కుర్రాడిగా మురిపించబోతున్నాడు.;
హీరో సిద్ధార్థ్ ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. పాత్రలో ఒదిగిపోవడానికి తన మేకోవర్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటాడు. లేటెస్ట్ గా ‘3 BHK’ మూవీ కోసం కాలేజ్ కుర్రాడిగా మురిపించబోతున్నాడు. ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇల్లు కొనే ప్రయత్నాల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా తమిళ ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజయ్యింది.
శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుణ్ విశ్వ నిర్మించారు. ఇంతకుముందు ‘8 తోట్టాక్కల్, కురుది ఆటం’ వంటి సినిమాలను అందించిన శ్రీ గణేష్, ఈ సినిమాతో మరింత బలమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించబోతున్నాడని ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని సిద్ధార్థ్ తల్లిదండ్రులుగా నటించగా, యోగిబాబు, మీఠా రఘునాథ్, చైత్ర ఆచార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి '3 BHK' ఆడియన్స్ ముందుకు వస్తుంది.