ఈ ఏడాది ముచ్చటగా మూడు సినిమాలు
మొత్తానికి ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను రీచ్ అవుతున్నాడు. ఈ రోజుల్లో ఇది చాలా అరుదైన విషయం. ప్రదీప్ టార్గెట్ ప్రేక్షకులు స్పష్టంగా యువత అని ఆయన కథా ఎంపికల ద్వారా స్పష్టమవుతోంది.;
వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్. 2022లో వచ్చిన "లవ్ టుడే" తో నటుడిగా బిగ్ హిట్ కొట్టిన ప్రదీప్, ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన "డ్రాగన్" సినిమా ద్వారా మరోసారి తమిళ్, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు, అతడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.
"లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ" అనే రొమాంటిక్ కామెడీ సినిమా సెప్టెంబర్ 18న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తోంది. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు. చిత్రీకరణను ఇటీవలే పూర్తిచేసిన చిత్ర బృందం, రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.
ఇదిలా ఉండగా, "డ్యూడ్" అనే మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా, నిర్మాణ బాధ్యతలు మైత్రీ మూవీ మేకర్స్ వహిస్తున్నారు. "ప్రేమలు" ఫేమ్ మమితా బైజు ఇందులో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు.
మొత్తానికి ప్రదీప్ రంగనాథన్ ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకులను రీచ్ అవుతున్నాడు. ఈ రోజుల్లో ఇది చాలా అరుదైన విషయం. ప్రదీప్ టార్గెట్ ప్రేక్షకులు స్పష్టంగా యువత అని ఆయన కథా ఎంపికల ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటికే రెండు హిట్లతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అండ్ ‘డ్యూడ్’ సినిమాల ద్వారా అదే సక్సెస్ ను కొనసాగిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.