‘జననాయకన్’ పై అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే !
తాజాగా.. పూజా హెగ్డే తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో సూపర్ ఎనర్జిటిక్ సెల్ఫీ డ్రాప్ చేసి, ఫ్యాన్స్‌కి ఓ మేజర్ అప్‌డేట్ ఇచ్చింది. ఆమె షూటింగ్ పార్ట్ పూర్తయిందట. ఇక డబ్బింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.;
తమిళ దళపతి విజయ్ ఫ్యాన్స్‌కి బిగ్ ట్రీట్ రెడీ అవుతోంది. అతడి నెక్స్ట్ అండ్ ఫైనల్ థియేట్రికల్ రిలీజ్ ‘జన నాయగన్’ కోసం అంచనాలు స్కై-హై లెవెల్స్‌లో ఉన్నాయి. హెచ్. వినోద్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామా, స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్‌తో ఆడియన్స్‌ని ఫుల్ ఎంగేజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా.. పూజా హెగ్డే తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో సూపర్ ఎనర్జిటిక్ సెల్ఫీ డ్రాప్ చేసి, ఫ్యాన్స్‌కి ఓ మేజర్ అప్‌డేట్ ఇచ్చింది. ఆమె షూటింగ్ పార్ట్ పూర్తయిందట. ఇక డబ్బింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ సెల్ఫీతో ఆమె ఎక్స్‌సైట్‌మెంట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్‌లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
ఈ బిగ్ బడ్జెట్ మూవీ షూటింగ్ ఇప్పుడు టర్బో స్పీడ్‌లో జరుగుతోంది. స్టార్ కాస్ట్‌లో బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమితా బైజు, ప్రియమణి, వరలక్ష్మి శరత్‌కుమార్ లాంటి హెవీవెయిట్ ఆర్టిస్టులు కీలక రోల్స్‌లో కనిపించ నున్నారు. కేవీయన్ ప్రొడక్షన్స్ తమ ఫస్ట్ తమిళ వెంచర్‌గా ‘జన నాయగన్’ని భారీ స్కేల్‌లో నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం, 2026 పొంగల్ కి గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. విజయ్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేస్తున్నారు.