అజిత్ సినిమాలో మోహన్ లాల్?

అజిత్ నటించనున్న ఏకే 64 కోసం ఆధిక్ రవిచంద్రన్.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను సంప్రదించాడని టాక్. “ఆధిక్.. మోహన్‌లాల్‌కు కథను వివరించాడట.;

By :  K R K
Update: 2025-06-20 01:50 GMT

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తో భారీ కమర్షియల్ హిట్ సాధించాడు. ఈ చిత్రాన్ని గతంలో ‘మార్క్ ఆంటోనీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశాడు. ఆధిక్ పని తీరుతో ఆకట్టుకున్న అజిత్, అతనితో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజా సమాచారం ప్రకారం.. అజిత్ నటించనున్న ఏకే 64 కోసం ఆధిక్ రవిచంద్రన్.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను సంప్రదించాడని టాక్. “ఆధిక్.. మోహన్‌లాల్‌కు కథను వివరించాడట. నిర్మాతలు మోహన్ లాల్ రెమ్యూనరేషన్‌ను ఖరారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది నిజమైతే.. ఏకే 64 కాస్టింగ్‌లో ఓ సంచలనం అవుతుంది.

అలాగే, శాండల్‌వుడ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి అజిత్ సరసన హీరోయిన్‌గా నటిస్తుందనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను కూడా నిర్మించనుంది. ఇంతకు ముందు మోహన్ లాల్ సూర్య నటించిన ‘బందోబస్తు’ మూవీలో ప్రధాన మంత్రిగా నటించి మెప్పించారు. మరి ఈ అజిత్ మూవీలో ఆయన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో చూడాలి.

Tags:    

Similar News