ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ ?

తాజా సమాచారం ప్రకారం.. ‘మహారాజ’ సీక్వెల్ పై పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు దర్శకుడు నిథిలన్ ఇప్పటికే సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఆ కథను వినగానే విజయ్ సేతుపతి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-05-08 01:10 GMT

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటనకు మారుపేరుగా నిలిచిన చిత్రం ‘మహారాజ’. నిథిలన్ స్వామినాథన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా, ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకులను మానసికంగా కలచివేసే ఎమోషనల్ కంటెంట్‌తో పాటు, విజయ్ సేతుపతి నటన సినిమాకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇది కేవలం కమర్షియల్‌గా కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా తెచ్చుకున్న సినిమాగా నిలిచింది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది.

తాజా సమాచారం ప్రకారం.. ‘మహారాజ’ సీక్వెల్ పై పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు దర్శకుడు నిథిలన్ ఇప్పటికే సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. ఆ కథను వినగానే విజయ్ సేతుపతి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ‘మహారాజ’ వంటి సినిమాలు కమర్షియల్ ఫార్ములాలకు అతీతంగా, ఒక గొప్ప కథతో, డీన్ మెసేజ్‌తో వస్తే ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో సుస్థిరంగా నిరూపించిన చిత్రం అది.

మహారాజ సీక్వెల్ కథ ఇప్పటివరకు గోప్యంగానే ఉంచారు. కానీ సినిమా మీద ఆసక్తి మాత్రం రోజు రోజుకీ పెరుగుతోంది. జపాన్‌లో కూడా ఇటీవల విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి రెస్పాన్స్‌ను పొందింది. ఇది అంతర్జాతీయంగా కూడా విజయ్ సేతుపతి క్రేజ్ ఎంత ఉందో చూపింది. ఇప్పుడు సీక్వెల్ అనగానే ఆడియన్స్‌లో మంచి ఎక్స్‌పెక్టేషన్ ఏర్పడటం సహజం. ఇదిలా ఉండగా, విజయ్ సేతుపతి ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'బెగ్గర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు ఓ వెబ్ సిరీస్‌కు కూడా సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజ్ నడుమ ‘మహారాజ 2’ అధికారికంగా ప్రకటైతే, సినిమా మీద భారీ హైప్ తక్కువకాలంలోనే ఏర్పడనుంది.

Tags:    

Similar News