కార్తీ ‘సర్దార్ 2’ షూటింగ్ పూర్తి !
"ఇట్స్ ఎ ర్యాప్! ఏమైనా ఇది అద్భుత జర్నీ..." అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ‘సర్దార్ 2’ ప్రోలాగ్ టీజర్ ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది.;
తమిళ స్టార్ హీరో కార్తి, పీయస్ మిత్రన్ కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ స్పై అడ్వంచరస్ చిత్రం ‘సర్దార్ 2’. ‘సర్దార్’ సూపర్ హిట్ చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. కార్తి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తూ, క్రూ మెంబర్స్‌తో కలిసిన ఫొటోలను పోస్ట్ చేసి.. "ఇట్స్ ఎ ర్యాప్! ఏమైనా ఇది అద్భుత జర్నీ..." అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ‘సర్దార్ 2’ ప్రోలాగ్ టీజర్ ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేసింది.
‘సర్దార్ 2’ మూవీలో కార్తితో పాటు యస్ జే సూర్య, మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్, యోగి బాబు, రజిషా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని చైనా, కంబోడియాలో 100 రోజుల పాటు షూట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఇది ఒక థ్రిల్లింగ్ స్పై యాక్షన్ మూవీగా రూపొందింది.
సామ్ సీయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫీ, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ హ్యాండిల్ చేస్తున్నారు. మొదటి సర్దార్ సక్సెస్‌తో ఈ సీక్వెల్‌పై ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొదటి భాగంలో ప్యాకేజింగ్ వాటర్ సమస్యను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు మిత్రన్.. రెండో భాగం కోసం మరో బర్నింగ్ ప్రాబ్లెమ్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరి ‘సర్దార్ 2’ మొదటి భాగాన్ని మించి సక్సెస్ అవుతుందేమో చూడాలి.