మోది మరో 20 ఏళ్ళు భారత్ ను పాలించాలి : ఇళయరాజా

లండన్‌లో తన మొదటి వెస్ట్రన్ క్లాసికల్ సింఫనీని సమర్పించిన తర్వాత ఆయన ప్రధాని మోదీని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.;

By :  K R K
Update: 2025-04-28 01:11 GMT

ప్రసిద్ధ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా.. ఇటీవల జీడీపీ పాడ్ కాస్ట్ లో హోస్ట్ శరత్ భట్టతిరిపాడ్‌తో ముచ్చటిస్తూ.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తన అనుభవాలను పంచుకున్నారు. లండన్‌లో తన మొదటి వెస్ట్రన్ క్లాసికల్ సింఫనీని సమర్పించిన తర్వాత ఆయన ప్రధాని మోదీని కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. హోస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "వ్యక్తిగతంగా మోదీ గారిని నేను ఎప్పుడూ కలవలేదు. నా 80వ పుట్టినరోజున మోదీ గారు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు," అని ఇళయరాజా తెలిపారు.

తర్వాత, పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంలో ప్రధాని మోదీని ప్రత్యక్షంగా కలిసిన విషయాన్ని వెల్లడించారు. "నాకు పద్మవిభూషణ్ లభించడం చాలా ఆశ్చర్యం కలిగించింది... అది మోదీ గారి దయ వల్లే జరిగింది. ఆయన నాపై ఎంతో సానుభూతి చూపించారు," అని అన్నారు. ఈ పురస్కారం ప్రకటించినప్పుడు తన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మాటలు కూడా చాల్లేదని గుర్తుచేసుకున్నారు.

పురస్కార కార్యక్రమం ముగిశాక జరిగిన టీ పార్టీ సందర్భంగా మోదీ గారిని కలిసి, "సార్.. నాదొక చిన్న రిక్వస్ట్ ... మీరు మరో 20 సంవత్సరాలు భారత్‌ను పాలించాలి," అని చెప్పిన సందర్బాన్ని మధురంగా గుర్తు చేసుకున్నారు. "అది జరుగుతోంది," అని ఉల్లాసంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, గత ప్రధాన మంత్రుల అభివృద్ధి కార్యక్రమాల జాబితాను నరేంద్ర మోదీ గారి కార్యక్రమాలతో పోలిస్తే స్పష్టమైన తేడా కనిపిస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా కాశీ విశ్వనాథ మందిరం అభివృద్ధి కార్యక్రమంపై మోదీ గారి కృషిని ప్రశంసించారు.

Tags:    

Similar News