తన పెళ్ళిపుకార్లను కొట్టి పడేసిన అనిరుధ్ రవిచందర్
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓ అయిన కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి ప్లానింగ్ లో ఉందని, సరికొత్త పుకార్లు తెరపైకి వచ్చాయి.;
కోలీవుడ్ క్రేజీ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ గతంలో కీర్తి సురేష్‌తో సహా పలువురు నటీమణులతో లింక్ అని పుకార్లు ఎదుర్కొన్నాడు. కానీ, ఆ వార్తలు నిజం కాదని తేలింది. ఎందుకంటే కీర్తి ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్‌ని పెళ్లి చేసుకుంది. మరో ఇద్దరు యువ నటీమణులతో కూడా అనిరుధ్ పై పెళ్ళి పుకార్లు వచ్చాయి. అవి కూడా రూమర్సే అని తేలింది.
అయితే .. ఇప్పుడు.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓ అయిన కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి ప్లానింగ్ లో ఉందని, సరికొత్త పుకార్లు తెరపైకి వచ్చాయి. అనిరుధ్ ఈ పుకార్లను తోసిపుచ్చి, ఎక్స్ లో స్పష్టం చేశాడు. ఆయన పోస్ట్ చేస్తూ.. “పెళ్లా?.. చిల్ అవుట్ గైస్... దయచేసి పుకార్లు స్ప్రెడ్ చేయడం ఆపండి” అని రాశాడు.
కావ్య మారన్, ఐపీఎల్ మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి సపోర్ట్ చేస్తూ కనిపించే చెన్నైకి చెందిన బిజినెస్‌వుమన్. సినీ పరిశ్రమలోని పలువురు హై-ప్రొఫైల్ సెలెబ్రిటీలతో స్నేహితురాలిగా పేరుగాంచింది. అయినప్పటికీ, ఆమెతో అనిరుధ్ పెళ్లి ప్లాన్‌ల గురించిన వార్తలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. మరిన్ని ఊహాగానాలను నివారించడానికి అనిరుధ్ తొందరగానే స్పష్టత ఇచ్చి, ఈ పుకార్లను ఖండించాడు. అనిరుధ్ రవిచందర్ రవిచందర్ డిమాండ్ ఇప్పుడు మామూలుగా లేదు. తమిళ, తెలుగు సినిమాల్లో అతడికి సమానమైన ఫాలోయింగ్ ఉంది.