ట్రెండింగ్ లో ‘హిట్ 3‘ ట్రైలర్
నేచురల్ స్టార్ నాని పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘హిట్ 3‘. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది.;
నేచురల్ స్టార్ నాని పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘హిట్ 3‘. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. సూపర్ హిట్ ‘హిట్‘ ఫ్రాంఛైజ్ లో థర్డ్ ఇన్ స్టాల్ మెంట్ గా ఈ మూవీ రాబోతుంది. లేటెస్ట్ గా ‘హిట్ 3‘ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది.
3 నిమిషాల 32 సెకండ్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్, థ్రిల్లింగ్ షాట్స్, టెన్షన్ బిల్డ్ చేస్తూ ఆసక్తికరంగా ఆకట్టుకుంటుంది. నానిని ఇప్పటివరకు చూడని తరహాలో ఇందులో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా అత్యంత క్రూరంగా అదరగొడుతున్నాడు. మాస్ ఆడియెన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్న ‘హిట్ 3‘ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 23.1 మిలియన్ వ్యూస్, 418K లైక్స్ తెచ్చుకుంది.
మొత్తానికి ‘హిట్ 3’ కంటెంట్ పరంగా, ప్రెజెంటేషన్ పరంగా ప్రేక్షకుల అంచనాలు మించిపోయేలా ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి అర్థమైంది. మరి.. మే 1న విడుదలై, బాక్సాఫీస్ దగ్గర కూడా ‘హిట్ 3‘ అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటుందా అనేది చూడాలి.