గోపీచంద్ కి హీరోయిన్ సెట్టయ్యింది!

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.;

By :  S D R
Update: 2025-03-27 01:29 GMT

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చారిత్రక చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రాన్ని 7వ శతాబ్దంలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నాడట సంకల్ప్ రెడ్డి. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమాను అత్యంత ప్రామాణికంగా రూపొందించేందుకు దర్శకుడు సంకల్ప్ రెడ్డి విశేషంగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా విజువల్స్, మేకింగ్‌లో కొత్తదనం తీసుకురావడానికి అతను ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడట.

ఈ చిత్రంలో గోపీచంద్ కి జోడీగా రితికా నాయక్ ను ఫైనలైజ్ చేశారట. ఇప్పటికే విశ్వక్ సేన్ తో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో మెరిసిన రితిక ప్రస్తుతం తేజ సజ్జతో 'మిరాయ్'లో నటిస్తుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ 15వ సినిమాలోనూ రితిక ను నాయికగా ఎంచుకున్నారు. ఇప్పుడు గోపీచంద్ రూపంలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తన కిట్టీలో వేసుకుంది రితిక నాయక్.

గోపీచంద్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం మీద, గోపీచంద్ – సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చారిత్రక చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచుకుంటోంది.

Tags:    

Similar News