22 ఏళ్ళ తర్వాత మళ్ళీ తండ్రీ కొడుకుల కాంబో !
కాళిదాస్ హీరో పాత్రల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా, ఈ సూపర్‌హిట్ తండ్రి-కొడుకు జోడీ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాలని మలయాళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది ఈ సినిమాతో నెరవేరబోతోంది.;
మలయాళ సీనియర్ స్టార్ జయరామ్, తన కుమారుడు కాళిదాస్‌తో 22 సంవత్సరాల తర్వాత మళ్లీ మలయాళ సినిమాలో స్క్రీన్ షేర్ చేయనున్నారు. ‘ఆశగల్ ఆయిరం' టైటిల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అరవింద్ రాజేంద్రన్, జూడ్ ఆంథనీ జోసెఫ్ రాసిన ఈ సినిమాకు జీ. ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇతను గతంలో నివిన్ పాలీ నటించిన సూపర్‌హిట్ 'ఒరు వడక్కన్ సెల్ఫీ' ని తెరకెక్కించాడు. ఈ సినిమాను గోకులం గోపాలన్ సమర్పణలో శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కాళిదాస్ బాల నటుడిగా 'కొచ్చు కొచ్చు సంతోషంగల్', 'ఎండే వీడు అప్పు విండేయుం' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసక్తికరంగా.. ఈ సినిమాల్లో అతను తన తండ్రి జయరామ్‌తో కలిసి నటించాడు. కాళిదాస్ హీరో పాత్రల్లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా, ఈ సూపర్‌హిట్ తండ్రి-కొడుకు జోడీ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాలని మలయాళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అది ఈ సినిమాతో నెరవేరబోతోంది.
'అశగల్ ఆయిరం' సినిమాలో ప్రతిభావంతులైన టెక్నీషియన్లు, రచయితల బృందం పనిచేస్తోంది. బైజు గోపాలన్, వీసీ ప్రవీణ్ సహ నిర్మాతలుగా.. కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కెమెరా బాధ్యతలను షాజీ కుమార్ నిర్వహిస్తుండగా, బడుష సనల్ దేవ్ సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఈ సినిమా లేటెస్ట్ అప్‌డేట్స్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటామని చిత్ర బృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. శ్రీ గోకులం మూవీస్ పలు మలయాళ, తమిళ చిత్రాలను నిర్మిస్తోంది. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియన్ మూవీ 'కిల్లర్', సురేష్ గోపి నటిస్తున్న 'ఒట్టకొంబన్', జయసూర్య టైటిల్ రోల్‌లో నటిస్తున్న 'కథనార్', దిలీప్ నటిస్తున్న 'భా.భా.భా', వంటి చిత్రాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.