అఖిల్ 6 నుంచి గ్లింప్స్ వస్తోంది!

అక్కినేని అఖిల్ కెరీర్‌లో మేజర్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చేసిన ఐదు సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో ఈసారి కథ ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకున్నాడు.;

By :  S D R
Update: 2025-04-07 13:16 GMT

అక్కినేని అఖిల్ కెరీర్‌లో మేజర్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. గతంలో చేసిన ఐదు సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోకపోవడంతో ఈసారి కథ ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకున్నాడు. లేటెస్ట్ గా అఖిల్ 6వ సినిమాకి సంబంధించి అనౌన్స్ మెంట్ రాబోతుంది.

అఖిల్ బర్త్ డే స్పెషల్ గా రేపు కొత్త సినిమాని ప్రకటించనున్నారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ (నందు) డైరెక్ట్ చేస్తున్నాడు.

చిత్తూరు ప్రాంతానికి చెందిన బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ మాస్ డ్రామాలో అఖిల్ పూర్తిగా చిత్తూరు యాసలో మాట్లాడనున్నాడట. ఈ మూవీలో అఖిల్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ప్రస్తుతం యాక్షన్ షెడ్యూల్ వేగంగా జరుగుతున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రేపు ఉదయం విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది.



Tags:    

Similar News