రిలీజ్ డేట్స్ మారుతున్నాయా?
కొందరు నిర్మాతలు రిలీజ్‌కు కేవలం నాలుగైదు రోజుల ముందు కూడా డేట్స్ మార్చేస్తుంటారు. ఇప్పుడు మూడు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్‌లో పెద్ద షఫుల్ జరుగుతోంది.;
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ తరచూ మారడం సర్వసాధారణం. కొందరు నిర్మాతలు రిలీజ్‌కు కేవలం నాలుగైదు రోజుల ముందు కూడా డేట్స్ మార్చేస్తుంటారు. ఇప్పుడు మూడు పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్‌లో పెద్ద షఫుల్ జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న, వశిష్ట డైరెక్ట్ చేస్తున్న “విశ్వంభర” ఎట్టకేలకు అక్టోబర్‌లో రిలీజ్ కానుంది. దీపావళి సీజన్‌లో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఈ డేట్ అధికారికంగా ఖరారైన తర్వాత, ఇతర పెద్ద సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ కూడా మారే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం, నందమూరి బాలకృష్ణ “అఖండ 2” సెప్టెంబర్ నుంచి డిసెంబర్‌కు వాయిదా పడిందని టాక్. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ “OG” సెప్టెంబర్ 25న రిలీజ్ కన్ఫర్మ్ అయింది.
ప్రభాస్ “ది రాజా సాబ్” ఇప్పటికే చాలా డిలేలు ఎదుర్కొంది. ఇప్పుడు ఈ సినిమా డిసెంబర్ నుంచి జనవరి 9, 2026 సంక్రాంతి రేసులోకి వెళ్తోంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. “ది రాజా సాబ్” డిసెంబర్ స్లాట్ ఖాళీ చేయడంతో, ఆ స్థానాన్ని “అఖండ 2” ఆక్రమించనుంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్‌తో మెగాస్టార్ చిరంజీవితో “మెగా157”ని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, “ది రాజా సాబ్” సంక్రాంతి స్లాట్ తీసుకోవడంతో ఈ ప్లాన్ మారేలా ఉంది. సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవడం సాధారణమే. అయినా, “విశ్వంభర” (దీపావళి)తో గ్యాప్ ఉండేలా “మెగా157” సమ్మర్ 2026కి వాయిదా పడే అవకాశం ఉందని ఇన్‌సైడర్స్ చెబుతున్నారు.