కేరళ లో ఇరగదీస్తోన్న ‘కింగ్ డమ్’ మూవీ!
కేరళలో తొలిసారిగా ఒక తెలుగు చిత్రం రూ. 1 కోటి వసూళ్లను రాబట్టింది.. అది కూడా మలయాళ డబ్బింగ్ వెర్షన్ లేకుండానే.;
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తెలుగు రాష్ట్రాలను దాటి, ఈ సినిమా అరుదైన ఘనతను సాధించింది. కేరళలో తొలిసారిగా ఒక తెలుగు చిత్రం రూ. 1 కోటి వసూళ్లను రాబట్టింది.. అది కూడా మలయాళ డబ్బింగ్ వెర్షన్ లేకుండానే.
ఈ విజయం విజయ్ దేవరకొండ కెరీర్‌లో సరికొత్త ఊపు ను తెచ్చిపెట్టడమే కాకుండా మలయాళ ప్రేక్షకుల మధ్య అతని పెరుగుతున్న పాపులారిటీని కూడా చాటిచెబుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాలకు పరిమితంగా భావించిన మార్కెట్ ఇప్పుడు బలమైన స్థానంగా మారుతోంది.
ఇక కింగ్‌డమ్ ప్రపంచవ్యాప్తంగా రూ. 67 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తూ, రూ. 100 కోట్ల మైలురాయిని సమీపిస్తోంది. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌లో అతిపెద్ద కమర్షియల్ సక్సెస్ గా నిలవనుంది.
భాగ్యశ్రీ బోర్సే, సత్య దేవ్, వెంకటేష్, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు.