రిలీజ్ డేట్స్ లో ఛేంజెస్!

తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదల తేదీల మార్పులు కొత్తేమీ కాదు. ఒక సినిమా రిలీజ్ కు కేవలం వారం రోజులుండగా వాయిదాలు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.;

By :  S D R
Update: 2025-08-03 15:10 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో విడుదల తేదీల మార్పులు కొత్తేమీ కాదు. ఒక సినిమా రిలీజ్ కు కేవలం వారం రోజులుండగా వాయిదాలు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ లో కొన్ని పెద్ద చిత్రాల విడుదల తేదీలలో మేజర్ ఛేంజెస్ జరగబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

ఈ ఆగస్టులో 'వార్ 2, కూలీ' వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇండిపెండెన్స్ డే స్లాట్ లో ఈ రెండు చిత్రాలూ విడుదలవుతున్నాయి. ఇక సెప్టెంబర్ లో దసరా కానుకగా బాలకృష్ణ 'అఖండ 2', పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రాలు విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. వీటిలో 'ఓజీ' ముందుగా అనుకున్న తేదీకే వచ్చే అవకాశాలున్నాయి. 'అఖండ 2' మాత్రం డిసెంబర్ కి షిప్ట్ అవ్వనుందట.

ఇక అక్టోబర్ లో దీపావళి కానుకగా చిరంజీవి 'విశ్వంభర' విడుదల కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డిసెంబర్ లో రావాల్సిన 'ది రాజా సాబ్' సంక్రాంతికి.. పొంగల్ కే ఫిక్సైన 'మెగా 157' సమ్మర్ కి షిఫ్ట్ అయ్యే సూచనలు ఉన్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News