వంద కోట్ల దిశగా ‘నరసింహ‘

తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద‘. అలాగే.. ఎస్వీ రంగారావు, రోజా రమణి ప్రధాన పాత్రల్లో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ఎ.వి.ఎమ్. తీసిన ‘భక్త ప్రహ్లాద‘ 1967లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.;

By :  S D R
Update: 2025-08-03 07:35 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి టాకీ చిత్రం ‘భక్త ప్రహ్లాద‘. అలాగే.. ఎస్వీ రంగారావు, రోజా రమణి ప్రధాన పాత్రల్లో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ఎ.వి.ఎమ్. తీసిన ‘భక్త ప్రహ్లాద‘ 1967లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. అలా.. తెలుగు ప్రేక్షకులకు ‘భక్త ప్రహ్లాద‘ కథతో ఎంతో అనుబంధం ఉంది.

ఇప్పుడు ఈ కథ యానిమేషన్ రూపంలో తెలుగు ఆడియన్స్ ను మరోసారి పలకరించింది. ‘మహావతార్ నరసింహ‘ పేరుతో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకెళ్తుంది. రిలీజ్ రోజు కేవలం రూ.2 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం రోజు రోజుకూ వసూళ్లు పెంచుకుంటూ వెళుతుంది.


తొమ్మిదో రోజు ఏకంగా రూ.19 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లోనూ ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు ఆదివారం కావడంతో ‘మహావతార్ నరసింహ‘ వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.



Tags:    

Similar News