చెప్పు తెగుద్ది : అనసూయ
ఆమె స్టేజ్‌పై స్పీచ్ ఇస్తుండగా.. కొంతమంది యువకులు అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్స్ విసిరేశారు. అనసూయ ఒక్క క్షణం ఆగకుండా, వెంటనే వాళ్లను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ ‘చెప్పు తెగుద్ది’...అని సమాధానం ఇచ్చింది.;
క్రేజీ యాంకర్, నటి అనసూయ గురువారం ఒక మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో కొందరు యువకులు హద్దు మీరి ప్రవర్తించడంతో ఫైర్ అయింది. ఆమె స్టేజ్‌పై స్పీచ్ ఇస్తుండగా.. కొంతమంది యువకులు అసభ్యకరమైన, అనుచితమైన కామెంట్స్ విసిరేశారు. అనసూయ ఒక్క క్షణం ఆగకుండా, వెంటనే వాళ్లను డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ ‘చెప్పు తెగుద్ది’...అని సమాధానం ఇచ్చింది.
ఆమె సూటిగా, కాస్త హెచ్చు స్వరంతో ... “నీ అమ్మ, చెల్లి, గర్ల్‌ఫ్రెండ్ లేదా ఫ్యూచర్‌లో నీ వైఫ్‌ని ఎవడైనా చెప్పుతో కొడితే నువ్వు సైలెంట్‌గా ఉంటావా? ఊరుకుంటావా?..” అని సీరియస్ గా ప్రశ్నించింది. ఆమె మాటలు ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయి. పబ్లిక్ ఫిగర్ అని, సెలబ్రిటీ అని ఎవరైనా ఏది పడితే అది మాట్లాడొచ్చని, ఏది పడితే అది చేయొచ్చని అనుకోవడం పూర్తిగా తప్పని ఆమె స్పష్టం చేసింది . “నేను పబ్లిక్‌లో ఉన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం ఏంటి?” అని ఆమె ఆగ్రహంతో ప్రశ్నించింది.
అనసూయ ఆగకుండా.. వాళ్ల ప్రవర్తన ఎంత అసహ్యంగా, అసభ్యంగా ఉందో ఎత్తి చూపింది . “ప్రతి ఒక్కరి లైఫ్‌లో మహిళలు ఉంటారు. అమ్మ, చెల్లి, గర్ల్‌ఫ్రెండ్, భార్య… వాళ్ల గురించి ఇలాంటి కామెంట్స్ విన్నా నువ్వు సహించగలవా? నీ కుటుంబంలోని మహిళల గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే నీవు ఊరుకుంటావా?” అని ఆమె తిరిగి ప్రశ్నించింది. ఆమె మాటలు కేవలం ఆ యువకులకే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
ఈ ఈవెంట్‌లో జరిగిన సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు అనసూయను బ్రేవ్‌గా, బోల్డ్‌గా అభినందించారు. “అనసూయ స్పాట్‌లోనే స్ట్రాంగ్‌గా స్పందించడం సూపర్! ఇలాంటి బిహేవియర్‌ను ఎదుర్కొనే ధైర్యం అందరికీ ఉండాలి,” అని చాలా మంది కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఆమెకు సపోర్ట్ వెల్లువెత్తింది.