‘#సింగిల్’ ఫస్ట్ సింగిల్ అదిరింది!

శ్రీవిష్ణు హీరోగా కార్తిక్‌రాజు దర్శకత్వంలో రూపొందుతున్న '#సింగిల్‌' చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. కేతిక శర్మ, ఇవానా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తుండగా, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.;

By :  S D R
Update: 2025-04-04 06:27 GMT

శ్రీవిష్ణు హీరోగా కార్తిక్‌రాజు దర్శకత్వంలో రూపొందుతున్న '#సింగిల్‌' చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. కేతిక శర్మ, ఇవానా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తుండగా, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా ప్రచారంలో స్పీడు పెంచుతున్నారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ‘శిల్పి ఎవరో‘ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది.

విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో శ్రీమణి రాసిన ఈ పాటను యాజిన్ నిజర్ పాడాడు. గీతా ఆర్ట్స్ 2 పై అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే నెలలో '#సింగిల్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Full View


Tags:    

Similar News