‘కన్నప్ప‘ నుంచి పరమశివుడు ఫస్ట్ లుక్!
మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప‘. ఈ సినిమాలో అక్షయ్ పోషిస్తున్న శివుడు పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.;
By : S D R
Update: 2025-01-20 07:41 GMT
మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప‘. శివ భక్తుడు కన్నప్ప కథతో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడు పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు అక్షయ్ పోషిస్తున్న శివుడు పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు అంటూ విడుదల చేసిన ఈ పోస్టర్ లో శివుడు పాత్రలో అక్షయ్ కుమార్ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి అక్షయ్ కుమార్ షూట్ పూర్తయ్యింది. అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనుండగా పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించబోతుంది. ఇంకా ప్రభాస్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కేమియోలలో మురిపించబోతున్నారు. ఏప్రిల్ 25న పాన్ ఇండియా లెవెల్ లో ‘కన్నప్ప‘ విడుదలకు ముస్తాబవుతుంది.