బాలకృష్ణను కలిసిన సినీ ప్రముఖులు
తెలుగు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణకు ఇటీవల భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.;
తెలుగు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ శ్రీ నందమూరి బాలకృష్ణకు ఇటీవల భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, చిత్రపురి హిల్స్ అసోసియేషన్ సహా పలు సంఘాల ప్రతినిధులు నందమూరి బాలకృష్ణ నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పద్మభూషణ్ బాలకృష్ణను ఘనంగా సత్కరించేందుకు త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ప్రత్యేక సన్మానం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా పరిశ్రమ ప్రముఖులు మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ గారు నటుడిగానే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి. ఈ పురస్కారం ఆయన చేసిన సేవలకు గుర్తింపు‘ అని ప్రశంసించారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఈ అవార్డు నా వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, మా కుటుంబానికీ, తెలుగు సినీ పరిశ్రమకూ దక్కిన గౌరవం. ఇది నాకు మరింత బాధ్యతను పెంచింది‘ అని భావోద్వేగంగా తెలిపారు.