'రెట్రో' నుంచి ఎనర్జిటిక్‌ సాంగ్ ‘ది వన్’

విలక్షణ నటుడు సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రెట్రో'. 'కంగువా' వంటి డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి వస్తోన్న మూవీ ఇది.;

By :  S D R
Update: 2025-04-12 16:59 GMT

విలక్షణ నటుడు సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రెట్రో'. 'కంగువా' వంటి డిజాస్టర్ తర్వాత సూర్య నుంచి వస్తోన్న మూవీ ఇది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో స్టైలిష్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. ఈ మూవీలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటించింది. జోజు జార్జ్, జయరామ్, నాజర్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ఇప్పటికే 'రెట్రో' షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి. లేటెస్ట్ గా 'ది వన్' అంటూ సాగే సింగిల్ రిలీజయ్యింది. డిఫరెంట్ రాప్ మిక్స్‌తో సూపర్ ఎనర్జిటిక్‌గా ఈ పాట ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరాం, సంతోష్ నారాయణన్ ఈ పాటను ఆలపించారు. స్టోన్ బెంచ్ క్రియేషన్స్, సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రం మే 1న విడుదలకు ముస్తాబవుతుంది.


Full View


Tags:    

Similar News