ఐటీ దాడులపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఐటీ రైడ్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన నివాసం, కార్యాలయాల్లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలపై స్పందించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.;

By :  S D R
Update: 2025-01-25 12:36 GMT

ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో ఐటీ రైడ్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక గడచిన నాలుగు రోజులుగా తన నివాసం, కార్యాలయాల్లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాలపై స్పందించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు.ఈ సందర్భంగా దిల్ రాజు అనేక అంశాలపై స్పష్టతనిచ్చారు.

2008లో జరిగిన ఐటీ దాడుల తర్వాత మళ్లీ ఇప్పుడు తమపై ఐటీ దాడులు జరిగాయని దిల్ రాజు అన్నారు. వ్యాపార రంగంలో ఇలాంటి సోదాలు సర్వ సాధారణమని, అయితే కొన్ని ఛానల్స్ తప్పుడు సమాచారం ప్రసారం చేశాయని ఆయన విమర్శించారు.

దిల్ రాజు పేర్కొన్న విషయాల ప్రకారం, ఐటీ అధికారులు తన వద్ద ఎలాంటి అనధికారిక డబ్బు లేదా డాక్యుమెంట్లు గుర్తించలేదని చెప్పారు. ‘నా వద్ద రూ.5 లక్షలు, శిరీష్ వద్ద రూ.4.5 లక్షలు, మా కుమార్తె వద్ద రూ.6.5 లక్షలు, ఆఫీసులో రూ.2.5 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ చట్టపరమైన డాక్యుమెంట్లతో పాటు ఉన్న డబ్బు‘ అని దిల్ రాజు వివరించారు. బంగారం కూడా లిమిట్స్ ప్రకారమే ఉందన్నారు.

‘గత ఐదేళ్లలో మేము ఎలాంటి కొత్త ప్రాపర్టీలు కొనుగోలు చేయలేదు. పెట్టుబడులు పెట్టలేదు‘ అని స్పష్టం చేసిన దిల్ రాజు, తమ బిజినెస్ లావాదేవీలన్నీ ఐటీ అధికారులకు పూర్తిగా వెల్లడించామని చెప్పారు.

ఫేక్ కలెక్షన్స్ కారణంగానే ఐటీ దాడులు జరిగాయన్న వార్తలపై కూడా దిల్ రాజు స్పందించారు. ‘టికెట్ కొనుగోళ్లు 90 శాతం ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. బ్లాక్‌మనీ సమస్య లేదు అన్నారు.

మరోవైపు, తన తల్లి ఆరోగ్యం విషయంలో వచ్చిన తప్పుడు వార్తలపై ఆయన స్పందించారు. ‘ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు ఎక్కువైంది. ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు‘ అని తెలిపారు. గుండెపోటు వచ్చిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని ఖండించారు.

Tags:    

Similar News