500 కోట్లకు చేరువలో 'కూలీ'
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన నాటి నుంచి ఈ సినిమా థియేటర్ల వద్ద మళ్లీ పండగ వాతావరణాన్ని సృష్టించింది.;
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన నాటి నుంచి ఈ సినిమా థియేటర్ల వద్ద మళ్లీ పండగ వాతావరణాన్ని సృష్టించింది. మొదటి రోజే రికార్డుల వేట మొదలుపెట్టిన ఈ సినిమా, తొలి వారంలోనే రూ.444 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. త్వరలోనే 500 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.
తమిళనాట ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో రజనీకాంత్ నటించిన ‘2.0, జైలర్’ ఉన్నాయి. ప్రస్తుతం ‘కూలీ’ ఐదో స్థానంలో ఉంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం మూడో స్థానానికి వెళ్లే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. ఇప్పటివరకూ తమిళనాట హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తొలి మూడు చిత్రాలు సూపర్ స్టార్ రజనీకాంత్ వే కానున్నాయి.
మరోవైపు ‘కూలీ’ వెయ్యి కోట్ల క్లబ్‌లో అడుగుపెడుతుందనే నమ్మకం బలంగా ఉన్నా, ఆ అవకాశం మిస్సయింది. ఫస్ట్ డే నుంచే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో ఆ ఫీట్ కలగానే మిగిలిపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ 'జైలర్' సీక్వెల్ 'జైలర్ 2'తో బిజీగా ఉన్నాడు. మరి.. 'జైలర్ 2'తోనైనా తమిళంలో తొలి వెయ్యికోట్లు సినిమా వస్తుందేమో చూడాలి.