ఘట్టమనేని వారసుడు - టండన్ బ్యూటీ

రవీనా టాండన్ కూతురైన రాశా, బాలీవుడ్‌లో ఇప్పటికే తన మార్క్ చూపిస్తూ.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ డెబ్యూ సినిమాలో నటించబోతోంది.;

By :  K R K
Update: 2025-08-23 06:18 GMT

బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు మరో యువ టాలెంటెడ్ హీరోయిన్ రాశా తడాని.. ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. రవీనా టాండన్ కూతురైన రాశా, బాలీవుడ్‌లో ఇప్పటికే తన మార్క్ చూపిస్తూ.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ డెబ్యూ సినిమాలో నటించబోతోంది.

డైరెక్టర్ అజయ్ భూపతి, రమేష్ బాబు కొడుకు జయ కృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాంచ్ అయింది. రాశా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు చర్చలు జరుపుతోంది. గతంలో రాశా పేరు రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విషయంలోనూ వినిపించింది.

20 ఏళ్ల రాశా.. ‘ఆజాద్, సింబా, హమ్ సబ్ తయ్యార్ హై’ వంటి బాలీవుడ్ సినిమాలతో ఇప్పటికే మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆమె ఈ తెలుగు ప్రాజెక్ట్‌లో చేరడం ద్వారా సినిమాకు ఖచ్చితంగా అదనపు ఆకర్షణ లభిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 15 నుంచి మొదలవనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలతో పాటు అధికారిక ప్రకటన వస్తుంది.

Tags:    

Similar News