అక్టోబర్ నుంచి మెగా సెట్స్ లో వెంకటేష్

టాలీవుడ్ వెటరన్ హీరోలలో చిరంజీవి, వెంకటేష్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అయితే.. వీరిద్దరూ ఇప్పటివరకూ కలిసి నటించలేదు.;

By :  S D R
Update: 2025-08-23 06:53 GMT

టాలీవుడ్ వెటరన్ హీరోలలో చిరంజీవి, వెంకటేష్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. అయితే.. వీరిద్దరూ ఇప్పటివరకూ కలిసి నటించలేదు. గతంలో మూవీ మొఘల్ రామానాయుడు చిరు-వెంకీ కలయికలో మల్టీస్టారర్ ప్లాన్ చేశారు.. కానీ కుదరలేదు. అయితే.. ఇప్పుడు ఆ అవకాశం అనిల్ రావిపూడికి వచ్చింది.

మెగా 157 ‘మన శంకరవరప్రసాద్ గారు‘లో చిరు-వెంకీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. లేటెస్ట్ గా రిలీజైన ఈ మూవీ గ్లింప్స్ లో వెంకటేష్ చెప్పిన చిన్న వాయిస్ ఓవర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వీరిద్దరూ కలిసి షూటింగ్ కి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మొదలు పెట్టుకుంటుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇక అక్టోబర్ నుంచి ఈ మూవీ సెట్స్ లోకి వెంకటేష్ కూడా జాయిన్ అవుతాడట. చిరంజీవి, వెంకటేష్ కాంబోలో ఒక పాట కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం‘తో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి.. వచ్చే సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్ గారు‘ని తీసుకొస్తున్నాడు. మొత్తంగా.. చిరంజీవి-వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ మెగా మూవీ ఆడియన్స్ కు ఎలాంటి విజువల్ ట్రీట్ అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News