శ్రీకాంత్ ఓదెల బ్లడ్ ప్రామిస్

టాలీవుడ్‌లో ఎంతమంది స్టార్‌లు ఉన్నా, మెగాస్టార్ మాత్రం ఒక్కడే. ఆయనే పద్మవిభూషణ్ చిరంజీవి. నిన్న చిరంజీవి 70వ పుట్టినరోజు జరుపుకోవటంతో సినీ ప్రముఖులు, అభిమానులు, సహచరులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపించారు.;

By :  S D R
Update: 2025-08-23 01:04 GMT

టాలీవుడ్‌లో ఎంతమంది స్టార్‌లు ఉన్నా, మెగాస్టార్ మాత్రం ఒక్కడే. ఆయనే పద్మవిభూషణ్ చిరంజీవి. నిన్న చిరంజీవి 70వ పుట్టినరోజు జరుపుకోవటంతో సినీ ప్రముఖులు, అభిమానులు, సహచరులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపించారు. కానీ అందరి విషెస్ కంటే ఎక్కువ హైలైట్‌గా నిలిచింది దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసిన పోస్ట్.

చిరంజీవి హార్డ్‌కోర్ ఫ్యాన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఓదెల, తన అభిమానాన్ని ఒక ప్రత్యేకమైన నోటుతో వ్యక్తం చేశాడు. 'నువ్వు నా డెమి గాడ్. చిరంజీవితో ఒక ఫోటో దిగితే, ఇంట్లో అమ్మ ఫస్ట్ టైమ్ నువ్వు నవ్వుతున్నావని చెప్పింది. అదే చిరంజీవి నిర్వచనం. నా లాంటి ఇంట్రోవర్ట్‌ని ఇంద్ర స్టెప్ చేయించగలడు, టికెట్లు కొనే అభిమాని నుంచి దర్శకుడిని చేయించగలడు. చిరంజీవితో సినిమా అంటే జీవితాంతం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. నేను నా చిరంజీవిని తెరపై మిస్ అవుతున్నాను. ఆయనను తిరిగి తీసుకువస్తానని ఇది రక్తంతో చేసిన ప్రమాణం – బ్లడ్ ప్రామిస్!' అని రాశాడు.

ఈ ఎమోషనల్ పోస్ట్‌తో పాటు చిరుతో మొదటిసారి తీసుకున్న ఫోటోను కూడా ఓదెల షేర్ చేశాడు. ఫోటోలో తన చేతులు వణికిపోవడంతో బ్లర్ అయ్యిందని, కానీ ఆ క్షణం మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పాడు. ఈ మాటలు మెగా అభిమానుల్లో గూస్‌బంప్స్ రేపుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే ‘దసరా’ సినిమాతో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు తన ఆరాధ్య హీరో చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు. ఇది అధికారికంగా ప్రకటించారు కూడా. మెగా 159గా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.



Tags:    

Similar News