బాలయ్యతో క్లాష్ కన్ఫమ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ పై వస్తోన్న రూమర్స్ కు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చెక్ పెట్టింది.;

By :  S D R
Update: 2025-07-03 00:57 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ పై వస్తోన్న రూమర్స్ కు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ చెక్ పెట్టింది. సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీకి 'ఓజీ' రావడం లేదనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో.. మరోసారి నిర్మాణ సంస్థ అదే తేదీని అధికారికంగా ధృవీకరించింది. అలాగే రిలీజ్ డేట్ పై రూమర్స్ నమ్మొద్దని తెలిపింది.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్‌లో కనిపించనుండగా, ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. త్వరలో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది.

ఇటీవలే బాలకృష్ణ ‘అఖండ 2’ కూడా సెప్టెంబర్ 25నే వస్తుందని ప్రకటించడంతో, 'ఓజీ' వాయిదా పడుతుందన్న వార్తలు తెగ హల్‌చల్ చేశాయి. అయితే 'రూమర్స్ ని నమ్మకండి' అంటూ మేకర్స్ స్పందించడంతో దసరా బరిలో బాలయ్య వర్సెస్ పవన్ క్లాష్ కన్ఫమ్ అయినట్టు అయ్యింది.

ప్రస్తుతం 'ఓజీ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 24న 'హరిహర వీరమల్లు' వస్తుంటే.. సెప్టెంబర్ 25న 'ఓజీ' రాబోతుంది. అంటే.. రెండు నెలల సమయంలో పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ లభించనుందన్నమాట.



Tags:    

Similar News