చిరు–బాలయ్య 'నాటు నాటు'
భారతీయ సినిమాను ప్రపంచానికి దగ్గర చేసిన చిత్రాలలో ‘ఆర్.ఆర్.ఆర్’ ఒకటి. ఈ సినిమా విడుదలై మూడేళ్లు దాటినా ఇంకా ఆ ప్రభావం అలాగే కొనసాగుతూ ఉంది.;
భారతీయ సినిమాను ప్రపంచానికి దగ్గర చేసిన చిత్రాలలో ‘ఆర్.ఆర్.ఆర్’ ఒకటి. ఈ సినిమా విడుదలై మూడేళ్లు దాటినా ఇంకా ఆ ప్రభావం అలాగే కొనసాగుతూ ఉంది. తాజాగా లండన్‌లోని చారిత్రాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో నిర్వహించిన ‘ఆర్.ఆర్.ఆర్ లైవ్ కాన్సర్ట్’ సంగీతాభిమానులకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. రాయల్ ఫిల్‌హార్మోనిక్ ఆర్కెస్ట్రా సహకారంతో, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తన మ్యాజిక్ టచ్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు.
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ, 'నాటు నాటు’లో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్‌చరణ్‌తో కలిసి స్టెప్పులేయడం నా జీవితంలో మరపురాని జ్ఞాపకం. చరణ్ తండ్రి చిరంజీవి, నా బాబాయ్ బాలకృష్ణ ఇద్దరూ అద్వితీయమైన డ్యాన్సర్లు. వీళ్లిద్దరూ కలిసి 'నాటు నాటు'కు స్టెప్పులేస్తే.. అది చరిత్రగా మిగిలిపోతుంది' అంటూ అభిమానులను ఆనందపరిచాడు.