‘గాంధీ తాత చెట్టు‘ బృందానికి చరణ్ అభినందనలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ‘గాంధీ చెట్టు తాత‘ బృందాన్ని అభినందించారు. నేటి సమాజానికి ఒక మంచి సందేశం అందించినందుకు చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు.;
By : S D R
Update: 2025-01-25 11:30 GMT
క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు‘. విడుదలకు ముందే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది ఈ చిత్రం. జనవరి 24న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ మూవీపై సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి తన అభినందనలు తెలియజేశాడు. లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ‘గాంధీ చెట్టు తాత‘ బృందాన్ని అభినందించారు. నేటి సమాజానికి ఒక మంచి సందేశం అందించినందుకు చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు.