బన్నీ వాస్ 'మిత్రమండలి'!

Update: 2025-06-07 07:50 GMT

టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉండే ప్రొడ్యూసర్స్ లో బన్నీ వాస్ ఒకరు. ఒకవైపు గీతా ఆర్ట్స్ 2 కి నిర్మాతగా వ్యవహరిస్తున్న బన్నీ వాస్ ఇప్పుడు తన సొంత బ్యానర్ BV వర్క్స్ పై తొలి సినిమాను రూపొందిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ తో బన్నీ వాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'మిత్రమండలి' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇటీవల విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ మాస్క్ లుక్ తో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా ఫస్ట్ లుక్ తో ఆ మిస్టరీకి ముగింపు పలికారు. పోస్టర్ లో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నిహారిక కూడా ఈ గ్యాంగ్ లో కీలక పాత్రలో కనిపించనున్నారు.

సినిమా మొత్తం స్నేహితుల మధ్య సాగే అనుబంధాన్ని హాస్యంతో మేళవించి నడిపేలా రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ తో విజయేందర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Tags:    

Similar News