తిరుపతిలో 'వీరమల్లు' ఫంక్షన్‌కు బ్రేక్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించి జూన్ 8న తిరుపతిలో నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వాయిదా పడింది.;

By :  S D R
Update: 2025-06-04 06:04 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా చిత్రం ‘హరిహర వీరమల్లు’ మళ్లీ వార్తల్లోకెక్కింది. ఈ చిత్రానికి సంబంధించి జూన్ 8న తిరుపతిలో నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వాయిదా పడింది. తిరుపతి ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో భారీగా జరగాల్సిన ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఏర్పాట్లు ఆపివేశారు.

మరోవైపు సినిమా విడుదల తేదీ (జూన్ 12) కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చిత్ర వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పోస్టు ప్రొడక్షన్ పనులు, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాకపోవడం వల్ల విడుదలను పోస్ట్‌పోన్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే విడుదల వాయిదాపై మాత్రం చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ చిత్రానికి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, తర్వాత జ్యోతి కృష్ణ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే విడుదల తేదీ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించిన కొత్త తేదీలు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

Tags:    

Similar News