దసరా బరిలో బాక్సాఫీస్ వార్?

ఈమధ్య బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల తేదీలపై డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఈ ఇద్దరూ తలపడే అవకాశం ఉందనే ప్రచారం అభిమానుల్లో చర్చకు దారితీసింది.;

By :  S D R
Update: 2025-05-22 11:51 GMT

ఈమధ్య బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల తేదీలపై డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. బాక్సాఫీస్ దగ్గర ఈ ఇద్దరూ తలపడే అవకాశం ఉందనే ప్రచారం అభిమానుల్లో చర్చకు దారితీసింది.

బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న 'అఖండ 2' చిత్రం సెప్టెంబర్ 25న విడుదల అవుతుందని ప్రారంభంలోనే ప్రకటించారు. ఒకవేళ షూటింగ్ ఆలస్యమయితే 2026 సంక్రాంతి బరిలో విడుదల అయ్యే అవకాశాలూ ఉన్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. లేటెస్ట్ షెడ్యూల్ తో పాటలు మినహా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్టే అని.. 'అఖండ 2' దసరా బరిలో రావడం పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి.

మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' సినిమాను సెప్టెంబర్ 26న విడుదల చేయాలని నిర్మాత డివివి దానయ్య భావిస్తున్నట్టు తెలుస్తోంది. దసరా సీజన్ 'ఓజీ'కి బాగా కలిసొస్తుందని నిర్మాత దానయ్య ఆ డేట్ పై ఆసక్తి చూపిస్తున్నారట. అయితే అదే సమయంలో 'అఖండ 2' కూడా వస్తే.., రెండు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి ఢీకొనడం ఖాయం. ఏదేమైనా.. త్వరలోనే 'ఓజీ' రిలీజ్ డేట్ పైనా క్లారిటీ రానుంది.

Tags:    

Similar News