రాహుల్ సిప్లిగంజ్ కు బోనాల బహుమతి!
గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ పురస్కారం ప్రకటించారు.;
గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ పురస్కారం ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గెలిచిన “నాటు నాటు” పాటను పాడిన రాహుల్‌కు, బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రూ. 1 కోటి నగదు నజరానా ప్రకటించింది. రాహుల్‌ను తెలంగాణ యువతకు ఆదర్శంగా అభివర్ణించిన సీఎం రేవంత్, ‘సొంత కృషితో ఎదిగిన రాహుల్ యువతకు మార్గదర్శకుడు‘ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
గతంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్‌కు రూ.1 కోటి ప్రోత్సాహకం అందిస్తామంటూ రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టి, గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో రాహుల్ పేరు ప్రత్యేకంగా ప్రకటించి, మరింత గౌరవాన్ని కల్పించారు. ‘నాటు నాటు‘ పాటతో అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు రాహఉల్. తెలంగాణ గాయకులను ప్రోత్సహిస్తున్నందుకూ ఈ బహుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.