'పుష్ప 2' రికార్డును ఈ సినిమా బద్దలు కొడుతుందా?

Update: 2025-02-24 07:00 GMT

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్పా 2: ది రూల్’ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. బాలీవుడ్ లో ఈ చిత్రం రూ. 800 కోట్లకు పైగా వసూళ్లతో ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రంగా నిలిచింది. మరో రెండు లేదా మూడు సంవత్సరాలు ఈ రికార్డును అధిగమించడం కష్టమేననుకున్నారు. అయితే, విక్కీ కౌశల్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ రికార్డుల వేటను ఇంకా కొనసాగిస్తోంది.

బాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా అద్భుత ప్రదర్శన కనబరుస్తూ రెండో వారం కలెక్షన్లతోనే రూ. 300 కోట్ల మార్కును దాటింది. ఈ చిత్రం ‘పుష్పా 2’ రికార్డును అధిగమించడం అంత సులభం కాకపోయినా, ట్రేడ్ అనలిస్టులు మాత్రం ఈ సినిమా ఊహించదగిన విజయాన్ని సాధించిందని భావిస్తున్నారు. కొందరు విశ్లేషకులు ‘ఛావా’ కూడా రూ. 800 కోట్ల క్లబ్‌లో చేరతుందని అభిప్రాయపడుతున్నారు.

అయితే, ‘ఛావా’ చిత్రం చివరకు ఎంత వసూలు చేస్తుందో తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు వేచిచూడాల్సిందే. చత్రపతి సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని ప్రతిబింబించే ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరాఠా రాజుగా, రష్మిక మందన్న రాణిగా కీలక పాత్రల్లో నటించారు.

Tags:    

Similar News