కియారా అద్వానీని రీప్లేస్ చేసేది ఎవరు?
‘డాన్ 3’ సినిమా నుంచి కియారా అద్వానీ వైదొలగిన విషయం హాట్ టాపిక్ గా మారింది. తాను గర్భవతిని అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత.. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని ఆమె నిర్ణయించు కుంది. అయితే, ఆమె స్థానంలో కృతి సనన్ ఎంపికైనట్టుగా బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం .. అందులో డాన్ సిరీస్‌లో కీలకమైన "రోమా" పాత్ర కోసం కృతి సనన్ ఎంపికయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పాత్రను గతంలో జీనత్అమన్, ప్రియాంక చోప్రా పోషించగా.. ఇప్పుడు కృతి తనదైన స్టైల్‌తో కొత్త శక్తిని అందించగలదని అభిమానులు భావిస్తున్నారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న డాన్ 3 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. కానీ రోమా పాత్రను నిజంగా ఎవరు పోషిస్తారన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కృతి సనన్ గ్రేస్, గ్రిట్ రెండింటినీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయగల నటి కాబట్టి.. ఈ పాత్రకు ఆమె సరైన ఎంపిక అవుతారని అభిమానులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఫర్హాన్ అక్తర్ లేదా ‘డాన్ 3’ చిత్రబృందం నుంచి కియారా వైదొలగిన విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు.. కియారా అద్వానీ తన ప్రసూతి విరామం అనంతరం మద్దాక్ ఫిలిమ్స్ బ్యానర్‌లో తన తదుపరి సినిమాను తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం.