విక్కీకౌశల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?

Update: 2025-03-14 10:40 GMT

‘ఛావా’ సినిమాతో సెన్సేషనల్ సక్సెస్ సాధించిన విక్కీ కౌశల్ నెక్స్ట్ మూవీపైనే ఉంది ఇప్పుడు అందరి దృష్టి. అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, అతడితో ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తుండడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా కబీర్ ఖాన్ ధృవీకరించారు. ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ, విక్కీతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.

సల్మాన్ ఖాన్‌తో ‘భజరంగీ భాయిజాన్’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన కబీర్ ఖాన్, గతంలో కత్రినా కైఫ్‌తో ‘న్యూయార్క్’, ‘ఏక్ థా టైగర్’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. కత్రినా-విక్కీ దంపతులతో తనకు మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలో, విక్కీతో పని చేయడం సులభంగా ఉంటుందని కబీర్ ఖాన్ తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ కోసం కబీర్ ఖాన్ ప్రస్తుతం రెండు స్క్రిప్టులపై పని చేస్తున్నారు. చర్చలు పూర్తయిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాను ప్రస్తుతం ‘మై మెల్‌బోర్న్’ వెబ్ సినిమాకు సమయం కేటాయిస్తున్నట్టు తెలిపారు. కబీర్ ఖాన్ ప్రస్తుతం ‘మై మెల్‌బోర్న్’ వెబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయనతో పాటు ప్రముఖ దర్శకులు ఇంతియాజ్ అలీ, ఓనిర్, రిమా దాస్ కలిసి పనిచేశారు.

ఈ వెబ్ సినిమా మార్చి 6న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీలలో విడుదల కానుండగా, మార్చి 14న భారత్‌లో విడుదల కానుంది. విక్కీ కౌశల్ – కబీర్ ఖాన్ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కొంత సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్‌పై బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Tags:    

Similar News