టార్చర్ సీన్ వల్ల షూటింగ్ కు నెలన్నర బ్రేక్ !
ప్రత్యేకంగా చిత్రీకరించిన ఒక చిత్రహింసా సన్నివేశం కారణంగా విక్కీకి తీవ్ర గాయం కాగా, షూటింగ్‌కు నెలన్నర పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది.;
బాలీవుడ్ క్రేజీ స్టార్ విక్కీ కౌశల్ మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజి మహారాజుగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ‘ఛావా’ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వెల్లడించాడు. ప్రత్యేకంగా చిత్రీకరించిన ఒక చిత్రహింసా సన్నివేశం కారణంగా విక్కీకి తీవ్ర గాయం కాగా, షూటింగ్‌కు నెలన్నర పాటు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ లక్ష్మణ్ ఉటేకర్.. ఎమోషనల్ అయ్యాడు.
"రాత్రంతా విక్కీ చేతులు కట్టేసి ఉండేవి. ఉదయం అవి విప్పేసిన తర్వాత కూడా చేతులు కిందికి రావడం లేదని గుర్తించాం. ఆయన చేతులు పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. దీంతో షూటింగ్‌ను ఆపేయాల్సి వచ్చింది. నెలన్నర విరామం తీసుకుని విక్కీ కోలుకున్న తర్వాత మళ్లీ సెట్స్‌ను మళ్ళీ నిర్మించి షూటింగ్‌ను కొనసాగించాం" అని తెలిపారు.
ఇంతకుమించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఛత్రపతి శంభాజి మహారాజ్‌పై నిజజీవితంలో చిత్రహింసలు జరిగిన అదే రోజున ఈ దృశ్యాన్ని చిత్రీకరించారని దర్శకుడు వెల్లడించాడు. "చిత్రీకరణ మొదలైన రోజునే చారిత్రకంగా సంభాజి మహారాజ్‌పై చిత్రహింసలు ప్రారంభమైన రోజుగా ఉండడం విశేషం," అని ఆయన చెప్పారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజి మహారాజ్‌గా నటించగా, రష్మిక మందన్న మహారాణి యేసుబాయిగా కనిపించనుంది. అలాగే, అక్షయ్ ఖన్నా మొఘల్ షాహెంషా ఔరంగజేబ్ పాత్రలో కనిపించనున్నారు.
సినిమాలో శంభాజి మహారాజ్-ఔరంగజేబ్‌ల మధ్య ఉన్న శత్రుత్వాన్ని ముమ్మాటికీ నిజమైన భావోద్వేగాలతో పలికించేందుకు, విక్కీ , అక్షయ్ ఖన్నా సెట్స్‌పై ఎటువంటి వ్యక్తిగత సంభాషణ జరిపేవారు కాదు . విక్కీ ఈ విషయాన్ని చెబుతూ, "ఆ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో మేమిద్దరం గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం, గుడ్ బై చెప్పడం అన్నీ మానేశాం. ఆయన ఔరంగజేబ్, నేను శంభాజి మహారాజ్. మేము నేరుగా షూటింగ్‌లోకి వెళ్లిపోయాం. విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా మధ్య ఎటువంటి వ్యక్తిగత సంభాషణ కూడా జరగలేదు" అని చెప్పాడు.