పాట్నా స్ట్రీట్స్ లో విక్కీ కౌశల్
‘చావా’ ప్రమోషన్స్ కోసం.. పాట్నాలో ఉన్న విక్కీ కౌశల్ అక్కడి ప్రసిద్ధ బిహారీ వంటకం ‘లిట్టి-చోఖా’ ను ఆస్వాదిస్తూ.. ఓ ఫుడ్ స్టాల్ ఎదుట నిలబడి ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు.;
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ తాజాగా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశాడు. ‘చావా’ ప్రమోషన్స్ కోసం.. పాట్నాలో ఉన్న అతడు అక్కడి ప్రసిద్ధ బిహారీ వంటకం ‘లిట్టి-చోఖా’ ను ఆస్వాదిస్తూ.. ఓ ఫుడ్ స్టాల్ ఎదుట నిలబడి ఉన్న ఫోటోలను పోస్ట్ చేశాడు. భద్రతా సిబ్బంది అతడి చుట్టూ ఉండగా.. తెల్లని కుర్తా-పైజామా ధరించి.. స్టైలిష్ గ్లాసెస్‌తో విక్కీ తన మామూలు హాండ్సమ్ లుక్స్‌లో దర్శనమిచ్చాడు.
"పాట్నా వచ్చి లిట్టి-చోఖా మిస్ అవ్వాలా?? చావా... అద్భుతమైన వార్త రాబోతోంది!". అని విక్కీ పోస్ట్ చేయగానే అభిమానులు అద్భుతమైన కామెంట్స్‌తో స్పందించారు. ఒకరు, "కత్రినా భాబీ జీని కూడా తీసుకురావచ్చు కదా?" అని సరదాగా రాయగా.. మరొకరు "మై హీరో!", "పాట్నా, బిహార్‌కు స్వాగతం!" అంటూ కామెంట్ చేశారు.
విక్కీ ప్రస్తుతం 'చావా' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చారిత్రక చిత్రం లో ఆయన మరాఠా చక్రవర్తి శంభాజీ మహారాజు పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ రచయిత శివాజీ సావంత్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించగా, కథానుసంధానం కూడా ఆయనే అందించారు. ఇంకా.. విక్కీ కౌశల్ త్వరలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'లవ్ అండ్ వార్' చిత్రంలో నటించనున్నాడు.