విక్కీ కౌశల్ జాదూ అవతారం !

అతడి నెక్స్ట్ మూవీగా ‘ఏక్ జాదూగర్’ ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు.;

By :  K R K
Update: 2025-04-07 02:25 GMT

రీసెంట్ గా ‘ఛావా’ సినిమాలోని తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన.. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ ఇప్పుడు మరో ప్రత్యేక పాత్రలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్నాడు. అతడి నెక్స్ట్ మూవీగా ‘ఏక్ జాదూగర్’ ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు.

“ఇక్కడ ఒక జాదూగర్ ఉన్నాడు.. ఆయన పేరే విక్కీ కౌశల్‌” అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో విక్కీ మాంత్రికుడి వేషధారణలో, జాదూ చేస్తూ కనిపించి ప్రేక్షకుల ఆసక్తిని రేపాడు విక్కీ. ఎలాగైతే గత సినిమాల్లో భిన్న పాత్రల్లో అలరించారో, ఈసారి కూడా విభిన్నమైన షేడ్స్‌తో తెరపై కనిపించనున్నాడు.

ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సూజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. రైజింగ్ సన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ త్వరలో వెల్లడి కానున్నాయని చిత్రబృందం పేర్కొంది. విక్కీ కౌశల్‌ మరోసారి తన మ్యాజిక్‌తో ప్రేక్షకులను ఎలా మంత్రముగ్ధులను చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News