ఈ మూవీ కోసం రెండు క్లైమాక్సులు తీశారా?
ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం క్లైమాక్స్ అని వెల్లడించాడు షాహిద్ కపూర్.;
బాలీవుడ్ స్టార్ హీరో .. షాహిద్ కపూర్ తాజా చిత్రం 'దేవా'. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ యాక్షన్ ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మొదటి నుంచీ 'దేవా' అంచనాలను పెంచుతూ వచ్చిందని చెప్పవచ్చు. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్.. ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం క్లైమాక్స్ అని వెల్లడించాడు. ఈ ప్రకటన మీడియాలో హైలైట్ అవ్వడమే కాకుండా సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఆసక్తికరంగా.. ఈ చిత్రానికి రెండు వేర్వేరు క్లైమాక్స్‌లను చిత్రీకరించారు మేకర్స్. వాటిలో ఏది ఫైనల్ అవుతుంది అనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే.. క్లైమాక్స్ ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందని సమాచారం.
షాహిద్ కపూర్ .. ఈ సినిమాలో ఓ బ్యాడ్ కాప్ పాత్రలో కనిపించబోతున్నారు. స్టైలిష్ లుక్‌తో, మాస్ ను ఆకట్టుకునే రీతిలో తన నటనలో వైవిధ్యాన్ని చూపించారు. మరోవైపు, పూజా హెగ్డే చక్కని అభినయంతో అందరినీ మెప్పించనుంది. ఈ బుట్టబొమ్మ ప్రస్తుతం సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. మరి ‘దేవా’ ఏ రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.