ఇజ్రాయెల్‌లో ‘ది డిప్లొమాట్’ ప్రత్యేక ప్రదర్శన
“ఈ చిత్రం భారతీయ దౌత్య వ్యూహం యొక్క బలాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశం వెలుపల ఈ సినిమాను మొదటిసారి ప్రదర్శిస్తున్న దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది.;
ఇటీవల బాలీవుడ్ హీరో జాన్ అబ్రహామ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది డిప్లొమాట్’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించింది ఇజ్రాయెల్ దేశం. ఇండియాలో కొత్తగా నియమితమైన ఇజ్రాయెల్ రాయబారి జేపీ సింగ్‌కు స్వాగతం పలుకుతూ... ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఈవెంట్‌ను నిర్వహించింది. ప్రముఖ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సాంస్కృతిక విభాగాధిపతి నూరిత్ తివారీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఆమె మాట్లాడుతూ, “ఈ చిత్రం భారతీయ దౌత్య వ్యూహం యొక్క బలాన్ని, గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశం వెలుపల ఈ సినిమాను మొదటిసారి ప్రదర్శిస్తున్న దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ఇది మన బలమైన సంబంధాలను మరోసారి రుజువు చేస్తుంది” అని పేర్కొన్నారు. ‘ది డిప్లొమాట్’ చిత్రంలో జాన్ అబ్రహామ్ జేపీ సింగ్‌గా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. రెండో అర్ధభాగం ఉత్కంఠతో నడుస్తూ రసవత్తరమైన ముగింపును అందిస్తుంది. పాటలు లేకుండా, ఎటువంటి గ్లామర్ తిప్పలు లేకుండా, నిజ జీవిత కథను తీపిగా చెప్పడం ఈ సినిమాకు ప్రత్యేకత.
నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో జాన్ అబ్రహామ్ దౌత్యవేత్త జేపీ సింగ్ పాత్రలో నటించారు. హీరోయిన్ సాదియా ఖతీబ్ కీలక పాత్ర పోషించారు. జాన్ అబ్రహామ్ తన JA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని టీ-సిరీస్, విపుల్ డి. షా, అశ్విన్ వర్దే, రాజేష్ బహల్, సమీర్ దిక్షిత్, జతీష్ వర్మ, రాకేష్ డాంగ్ సహకారంతో నిర్మించారు.