ఒక వైపు భక్తి కలిగిస్తోంది.. మరో వైపు రక్తికట్టిస్తోంది !
ఒకవైపు భక్తి భావనతో కూడిన పాత్రలో అలరిస్తుండగా.. మరోవైపు డాన్స్ నెంబర్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రక్తికట్టిస్తూ.. తమన్నా భాటియా తన వైవిధ్యమైన నటన, డ్యాన్స్ ప్రతిభతో రెండు వైపులా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.;
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన తెలుగు డివోషనల్ థ్రిల్లర్ “ఒదెల 2” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆమె శివశక్తి అనే ఆధ్యాత్మికతతో నిండిన పాత్రలో కనిపించబోతోంది. భక్తి భావనను ప్రేక్షకుల హృదయాల్లో నింపడానికి తమన్నా ఈ సినిమాలో తన నటనతో ప్రత్యేకంగా అలరించనుంది.
అలాగే.. తమన్నా మరోవైపు బాలీవుడ్‌లో కూడా సందడి చేస్తోంది. “రైడ్ 2” అనే హిందీ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ “నషా” ఇటీవల లీక్ కావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ రోజు ఈ పాట అధికారికంగా విడుదల అయ్యింది, వెంటనే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. తమన్నా చేసిన హాట్ అండ్ ఎనర్జిటిక్ డాన్స్ మూడ్స్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి.
తమన్నా ఐటెం సాంగ్స్‌కు రికార్డులు సాధించడంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఇటీవల ఆమె “స్త్రీ 2” సినిమాలో చేసిన పాటకు 800 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్టు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇది ఓ భారతీయ ఐటెం సాంగ్‌కు సాధించిన అత్యధిక వ్యూస్ గా రికార్డైంది. ఇంతకు ముందు రజనీకాంత్ “జైలర్ ” లో ఆమె చేసిన ‘నువు కావాలయ్యా’ పాట కూడా భారీ రికార్డుల్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
ఒకవైపు భక్తి భావనతో కూడిన పాత్రలో అలరిస్తుండగా.. మరోవైపు డాన్స్ నెంబర్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రక్తికట్టిస్తూ.. తమన్నా భాటియా తన వైవిధ్యమైన నటన, డ్యాన్స్ ప్రతిభతో రెండు వైపులా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది