తుదిదశ చిత్రీకరణలో ‘థామా’ మూవీ !
హారర్, కామెడీ, మైథాలజీ మేళవింపుతో రూపొందుతున్న ఈ విభిన్నమైన చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకుడు. ఏప్రిల్ 28న తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ పర్వతప్రాంతాల్లో తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. మే 25వరకు కొనసాగనుంది.;
బాలీవుడ్ యంగ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న క్రేజీ బాలీవువ్ మూవీ "థామా". ఈ మూవీ తుది దశ షూటింగ్‌ను ప్రారంభించింది. హారర్, కామెడీ, మైథాలజీ మేళవింపుతో రూపొందుతున్న ఈ విభిన్నమైన చిత్రానికి ఆదిత్య సర్పోత్దార్ దర్శకుడు. ఏప్రిల్ 28న తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ పర్వతప్రాంతాల్లో తాజా షెడ్యూల్ ప్రారంభమైంది. మే 25వరకు కొనసాగనుంది.
ప్రస్తుతం డొడ్డబెట్ట శిఖరం పరిసరాల్లో చిత్రబృందం కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ముఖ్యంగా నాయికానాయకుల మీద ప్రేమకథతోపాటు క్లైమాక్స్ సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో షూట్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 28 నుంచి అయుష్మాన్, రష్మిక నటించాల్సిన పార్ట్‌ను ఊటీ అరణ్యాల్లో షూట్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు డొడ్డబెట్ట పీక్ చుట్టుపక్కల ఉన్నారు. త్వరలో నవాజుద్దీన్ సిద్ధికీ షూట్‌కు జాయిన్ అవుతారు. ఆయన పాత్ర పాతకాలానికి చెందినదిగా ఉండి, వ్యాంపైర్‌గా ఎలా మారాడన్న నేపథ్యాన్ని అలాగే క్లైమాక్స్‌ను కూడా ఇదే షెడ్యూల్‌లో తీస్తారు,” అని సమాచారం అందించింది.
నవాజుద్దీన్ సిద్ధికీ ఇందులో ఒక మిస్టీరియస్ వ్యాంపైర్ పాత్రలో కనిపించనున్నాడు. అతని చీకటి గతం కథలో కీలకంగా ఉండనుండటంతో, ఆయన పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ భాగాన్ని మే మూడో వారంలో ప్రారంభించే షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారు. "థామా" అనే పేరు మహాభారతంలోని అశ్వత్థామ అనే అమరయోధుడి పేరు నుంచే తీసుకున్నది. ఈ సినిమా కథ ఆధునిక భారత్‌లో ఒక చరిత్రకారుడి (అయుష్మాన్ పాత్ర) ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ఈ ఊటీ షెడ్యూల్ ముగిశాక.. చిత్రీకరణలో ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.