స్పెషల్ సాంగ్ లో మళ్లీ మిల్కీ బ్యూటీ?
తాజా సమాచారం ప్రకారం.. అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రెయిడ్ 2’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయనుంది.;
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్, తెలుగు సినిమాల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కెరీర్ చివరి దశలో గ్లామరస్ రోల్స్, ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రెయిడ్ 2’ సినిమాలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయనుంది.
ఈ ప్రత్యేక గీతంలో రాపర్ హనీ సింగ్ కూడా పాల్గొననున్నాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ గంగూలీ ఈ పాటకు నృత్యరీతులను సమకూర్చనున్నారు. ముంబయిలోని ఒక స్టూడియోలో ఈ వారం ఈ పాటను చిత్రీకరించనున్నారు. తమన్నా గతంలో ‘స్ట్రీ 2’ చిత్రంలోని ‘ఆజ్ కి రాత్’ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అయితే, ‘రెయిడ్ 2’ స్పెషల్ సాంగ్‌లో అజయ్ దేవ్‌గణ్ కనిపించబోడు.
ఈ పాటను ప్రమోషన్ కోసం మాత్రమే కాకుండా సినిమాలో కూడా వినిపించనున్నారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పనోరమా స్టూడియోస్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.