ఈ వెబ్ సిరీస్ లో క్యామియోలు గా స్టార్ హీరోస్!

Update: 2025-02-07 08:09 GMT

ఈ వెబ్ సిరీస్ లో క్యామియోలు గా స్టార్ హీరోస్!కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమవుతున్న వెబ్ సిరీస్ "బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్". ఈ సిరీస్‌ను ఇటీవలే షారుక్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ వెబ్ సిరీస్‌లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, ఎస్.ఎస్. రాజమౌళి, రణబీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహర్‌లు స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ విషయంపై నివేదికలో... "స్టార్స్ తమ నిజ జీవిత పాత్రలుగానే కనిపించనున్నారు. ఈ కేమియోలు ప్రేక్షకులకు మెటా రిఫరెన్స్‌లను అందించడమే లక్ష్యంగా ఉంచారు" అని పేర్కొంది.

ఇప్పటికే సినీ ప్రియులు ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వార్త నిజమైతే, 'బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' రికార్డు స్థాయిలో వీక్షణలను నమోదు చేసుకోవడం ఖాయం.

ఈ వెబ్ సిరీస్‌లో ప్రముఖ నటుడు బాబీ డియోల్, "కిల్ " సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న లక్ష్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ షోను 2025 జూన్‌లో స్ట్రీమింగ్‌కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీల్ సీజన్ సందర్భంగా ఈ వెబ్ సిరీస్‌కు భారీ స్థాయిలో ప్రమోషన్ నిర్వహించనున్నారు. ""బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్" ఒక మెగా ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది.

Tags:    

Similar News