ఫైనల్ స్టేజ్ లో ‘సికందర్’ షూటింగ్

Update: 2025-02-22 05:50 GMT

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జోడీగా నటిస్తున్న ‘సికందర్’ బాలీవుడ్ యాక్షన్ చిత్రాన్ని బిగ్ స్ర్కీన్ పై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గరపడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఇంకా కేవలం రెండు రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.

‘సికందర్’ చిత్రం ఈద్ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 14 న ముంబై షెడ్యూల్‌ను సల్మాన్ ఖాన్ పూర్తి చేశారని సమాచారం. షూటింగ్ తెల్లవారుజామున 6 గంటల వరకు సాగింది. ప్రస్తుతం చిత్రంలోని ప్రధాన సన్నివేశాలన్నీ షూట్ అయి.. పోస్ట్-ప్రొడక్షన్ దశకు వెళ్లాయి. ఇక రెండు రోజుల రాజ్ కోట్ షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. మార్చి మొదటి వారంలో సల్మాన్ ఖాన్ చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నాడు. ఈ చిత్రంలో హై-ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో, వాటికి అధునాతన గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అవసరం. ఈ దశను వేగంగా పూర్తి చేయడానికి సాజిద్ నడియాడ్‌వాలా అదనపు వనరులను కేటాయించారు. దర్శకుడు మురుగదాస్ ఈ ప్రాజెక్ట్‌ను చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు.

రీసెంట్ గా సాజిద్ నడియాడ్‌వాలా పుట్టినరోజు సందర్భంగా ‘సికందర్’ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇందులో సల్మాన్ ఖాన్ అగ్రెసివ్ లుక్‌తో, ఓ పదునైన ఆయుధాన్ని పట్టుకుని కనిపించాడు. “మీ అందరి సహనం మాకు ఎంతో ప్రాముఖ్యం. మీ ప్రేమకు ఇది చిన్న గిఫ్ట్” అంటూ టీజర్ పోస్ట్ చేశారు. అదేవిధంగా.. ఫిబ్రవరి 27న ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వనున్నామని వెల్లడించారు. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కాజల్ అగర్వాల్, శర్మన్ జోషి ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News