ఈ వార్త సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది

శ్రద్ధా కపూర్ తన ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ రాహుల్ మోదీని పెళ్లి చేసుకోబోతోందని న్యూస్ స్ప్రెడ్ అయింది.;

By :  K R K
Update: 2025-04-07 09:33 GMT

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రేమ జీవితం ఎప్పటికప్పుడు వార్తల్లోకెక్కుతూ ఉంటుంది. పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ఆమె పేరు జతకట్ట బడడం, ఆ తర్వాత బ్రేకప్‌ల వార్తలు రావడం అనేది సర్వసాధారణ మైపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న తాజా వార్త ఏమిటంటే.. శ్రద్ధా కపూర్ తన ప్రస్తుత బాయ్‌ఫ్రెండ్ రాహుల్ మోదీని పెళ్లి చేసుకోబోతోందని న్యూస్ స్ప్రెడ్ అయింది. రాహుల్ మోదీ స్క్రిప్ట్ రైటర్... అలాగే ముంబైలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవాడు.

ఈ వార్తలకు మళ్ళీ ఊపొచ్చినదీ ఒక రెడిట్ పోస్ట్ వల్ల. శ్రద్ధా కుటుంబం ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లను ప్రారంభించిందనీ, పెళ్లి కూతురు డ్రెస్‌ కొనుగోలు మొదలుకొని ఇతర ఏర్పాట్లలో కూడా నిమగ్నమయ్యారనీ ఆ పోస్ట్‌లో మెన్షన్ చేశారు. ఈ పెళ్లి విదేశాలలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు. ముఖ్యంగా ఓ బీచ్‌ రిసార్ట్‌ వద్ద జరిగే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. శ్రద్ధా కపూర్‌కు బీచ్‌లపై మక్కువ ఎక్కువ.

ఈ వార్తలు నిజమో కాదో ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఇలాంటివే గతంలోనూ పుట్టుకొచ్చినప్పటికీ అవన్నీ తప్పుగా తేలిపోయాయి. ఇప్పటివరకు శ్రద్ధా గానీ, ఆమె టీమ్ గానీ పెళ్లి గురించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. 38 ఏళ్ల శ్రద్ధా సినీ కెరీర్ ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉంది. ఇటీవల విడుదలైన ఆమె సినిమా “స్త్రీ 2” భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాక.. ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రద్ధకు ఉన్న పాపులారిటీ మరీ మామూలుగా లేదు. శ్రద్ధా కపూర్‌కు ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 94 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Tags:    

Similar News